ఎన్‌సీసీ కెడెట్స్‌కు శిక్షణ | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ కెడెట్స్‌కు శిక్షణ

Published Sun, May 26 2024 5:15 AM

ఎన్‌సీసీ కెడెట్స్‌కు శిక్షణ

జయపురం: బరంపురం ఎన్‌సీసీ గ్రూపు హెడ్‌క్వార్టర్‌ పరిధిలోని జయపురం విక్రదేవ్‌ విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ఎన్‌సీసీ కెడెట్స్‌కు వేసవి వికాశ రెండో విడత శిక్షణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఓఎస్‌డీ డాక్టర్‌ ప్రొఫసర్‌ దేవీప్రసాద్‌ మిశ్ర జ్యోతిని వెలిగించి శిబిరాన్ని ప్రారంభించారు. క్యాంపు కమాండెంట్‌ లెఫ్ట్‌నెంట్‌ కర్ణల్‌ ప్రీతి రంజన్‌ దాస్‌ ముఖ్యవక్తగా హాజరై శిబిరంలక్ష్యం, ప్రాధాన్యతను వివరించారు. ఎన్‌సీసీ కెడెట్లు సమాజానికి, దేశానికి సేవ చేసేందుకు ముందుండాలని ఉద్బోంధించారు. ఎన్‌సీసీతో క్రమశిక్షణ అలవడుతోందన్నారు. విక్రమదేవ్‌ విశ్వ విద్యాలయ అసోసియేట్‌ ఎన్‌సీసీ అధికారి కెప్టెన్‌ లక్ష్మణ పాత్రో పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శిబిరంలో మొదటి విడత శిక్షణలో కొరాపుట్‌ జిల్లా నుంచి 317 మంది, రెండో విడతలో 400 మంది కెడెట్లు పాల్గొన్నట్టు నిర్వాహక అధికారులు వెల్లడించారు. శిక్షణలో భాగంగా మ్యాప్‌ రీడింగ్‌, తుపాకులు పేల్చటం, డ్రిల్‌, పేరెడ్‌, అగ్నిప్రమాద నివారణ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ తదితర అంశాలపై అవగాహన కల్పించార. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి న్యూఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవాలలో జరిగే పేరేడ్‌కు పంపిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement