సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్ | CJP Tiranga Yatra Delhi October 16 Updates | Sakshi
Sakshi News home page

సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్

Oct 16 2026 10:47 AM | Updated on Oct 16 2026 10:58 AM

CJP Tiranga Yatra Delhi October 16 Updates

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో తిరంగా యాత్ర నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీజేపీ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న తిరంగా యాత్ర దృష్ట్యా సెంట్రల్ పార్క్‌ను నేడు, రేపు మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ప్రకటించింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. సీజేపీ నిరసన కార్యక్రమానికి ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

అయితే, జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించేందుకు 11 మందితో కూడిన బృందానికి అనువైన ప్రదేశంలో అవకాశం కల్పిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరారు. తిరంగా యాత్ర నేపథ్యంలో కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో రాకపోకలపై ఆంక్షలు ఉండటంతో ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: తిరంగా మార్చ్‌: అభిజీత్‌ దీప్కే సంచలన ఆరోపణలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement