ఫ నాగుల చవితి పూజలు | Sakshi
Sakshi News home page

ఫ నాగుల చవితి పూజలు

Published Sat, Nov 18 2023 1:32 AM

- - Sakshi

● మునుగోడులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సతీమణి అరుణ, కుమార్తె రమ్య, కోడలు స్రవంతి, కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి, కుమారుడు సంకీర్త్‌రెడ్డి, కోడలు తరుణ్య, బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి తరఫున ఆయన భార్య రజిత, సోదరుడు నర్సింహారెడ్డి, కుమారుడు వినయ్‌కుమార్‌రెడ్డి, కోడలు లితిక ప్రచారం చేస్తున్నారు.

● సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి జగదీష్‌రెడ్డి గెలుపు కోసం ఆయన తండ్రి, తనయుడు, సతీమణి ప్రచారం కొనసాగిస్తున్నారు. మంత్రి సతీమణి సునీత నెల రోజుల ముందు నుంచే సూర్యాపేట పట్టణంలో కలియ దిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెతోపాటు మంత్రి కుమారుడు వేమన్‌రెడ్డి, తండ్రి చంద్రారెడ్డి ఇంటింటికీ తిరుగుతూ బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి కోసం ఆయన కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు కోసం ఆయన సతీమణి లక్ష్మి, కుమారులు సంకినేని అరుణ్‌, వరుణ్‌, కోడళ్లు అనూష, సుష్మ ప్రచారం చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థి జానయ్య యాదవ్‌ కోసం ఆయన సతీమణి రేణుక ప్రచారం చేస్తున్నారు.

● తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్‌ గెలుపు కోసం ఆయన సతీమణి గాదరి కమల విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య సతీమణి సరస్వతి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.

● కోదాడ నియోజకవర్గంలో సతి కోసం పతి ప్రచారం ఆకట్టుకుంటోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి గెలుపు కోసం ఆమె భర్త, ఎంపీ, హుజూర్‌నగర్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోనూ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితోపాటు, ఆయన తరపున బంధువులు ప్రచారం కొనసాగిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి బొల్లం మల్లయ్యయాదవ్‌ తరఫున ఆయన సతీమణి

ఇందిర, కూతురు కావ్య, కోడలు నవత ప్రచారం చేస్తున్నారు.

● హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి రజిత, సోదరుడు శేఖర్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి తరఫున ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మి తరఫున ఆమె భర్త మల్లు నాగార్జునరెడ్డి ప్రచారం చేస్తున్నారు.

● దేవరకొండలో బీజేపీ అభ్యర్థి లాలునాయక్‌ను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీంద్ర కుమార్‌ కోసం ఆయన సతీమణి శ్యామల, కాంగ్రెస్‌ అభ్యర్థి బాలునాయక్‌ తరఫున ఆయన సతీమణి జ్యోతిప్రసన్న ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

● నకిరేకల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపుకోసం ఆయన కుమారుడు మనోజ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశం గెలుపు కోసం ఆయన కుమారుడు విపుల్‌ ప్రచారం చేస్తున్నారు.

● ఆలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత తరఫున ఆమె భర్త గొంగిడి మహేందర్‌రెడ్డి, అల్లుడు అక్షయ్‌రెడ్డి, కుమార్తె అంజనీరెడ్డి, హర్షితరెడ్డి, తమ్ముడు వాసు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల అయిలయ్య తరఫున ఆయన సతీమణి అనిత, కుమార్తెలు అరుంధతి, శృతి, సోదరుడు శంకర్‌ ప్రచారం చేస్తున్నారు.

● భువనగిరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి తరఫున ఆయన భార్య వనితారెడ్డి, కుమార్తె మాన్వితారెడ్డి, సోదరుడు భీమార్జున్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తరఫున భార్య కిరణ్‌జ్యోతిరెడ్డి, కుమారుడు శ్రీరామ్‌రెడ్డి, కుమార్తెలు కీర్తిరెడ్డి, స్ఫూర్తిరెడ్డి, అల్లుళ్లు శ్రీనివాస్‌రెడ్డి, అలోక్‌రెడ్డి, సోదరీమణులు విజయలక్ష్మి, ఝాన్సీ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి తరఫున కుమారుడు ప్రణయ్‌రెడ్డి, కోడలు డాక్టర్‌ స్రవంతి, సోదరులు గూడూరు నరోత్తంరెడ్డి, జైపాల్‌రెడ్డి, మరదలు రేణుక ప్రచారంలో ఉన్నారు.

‘కూచిపూడి’తో ఆకట్టుకొని..

ఫ నేషనల్‌ చిల్డ్రన్స్‌ డే వేడుకల్లో

సత్తాచాటిన జిల్లా బాలికలు

నాగార్జునసాగర్‌: నేషనల్‌ చిల్డ్రన్స్‌ డే సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ బాలభవన్‌లో 17 నుంచి చిల్డ్రన్స్‌ అసెంబ్లీ అండ్‌ ఇంటిగ్రేషన్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 వరకు కొనసాగనున్న ఈ వేడుకల్లో శుక్రవారం జిల్లాలోని నాగార్జున్‌సాగర్‌లోని బాలభవన్‌ తరఫున విద్యార్థినులు కున్‌రెడ్డి ఇప్సిక, శ్రీహరిణి, రేష్నవి, చందన కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకొని శభాష్‌ అనిపించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్‌ బాల భవన్‌ డైరెక్టర్‌ శ్రీమతి ముక్తా అగర్వాల్‌ హాజరై విద్యార్థినులను అభినందించారు.

కదిలొస్తున్న

బలగం

నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి రమాదేవి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తరఫున ఆయన సతీమణి సబితతో పాటు కూతురు శ్రీనిధి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ సతీమణి విజయలక్ష్మి ప్రచారం చేస్తున్నారు.

నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ కోసం ఆయన తల్లి లక్ష్మి, సతీమణి నోముల భవాని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి తరఫున తండ్రి జానారెడ్డి ప్రచారం చేస్తున్నారు.

అభ్యర్థులకు తోడుగా.. నీడగా ఇంటిల్లిపాది

ఫ తమ వారి గెలుపు కోసం చెమటోడుస్తున్న బంధుగణం

ఫ గడపగడపకూ తిరుగుతూ ఓటర్లతో మమేకం

ఫ అన్నీ తామై ముందునడుస్తున్న చుట్టాలు

ఫ తెరముందు కొందరు.. తెరవెనుక మరికొందరు

వినూత్న రీతిలో..

కొందరు అభ్యర్థుల బంధువులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మిర్చీ బజ్జీలు, టీ చేస్తూ ఒకరు, పండ్లు అమ్ముతూ మరొకరు, పిల్లలను ఎత్తుకొని లాలిస్తూ, దుస్తులు ఇసీ్త్ర చేస్తూ, మేసీ్త్ర పనిచేస్తూ ఓట్లు అడుగుతున్నారు. ప్రచారం కోసం సామాజిక మాధ్యమాలను సైతం వినియోగించుకుంటున్నారు. ఇందులో తమ అభ్యర్థులు చేసిన, చేయబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా వచ్చి ఓటు అడుగుతున్న తీరు వృద్ధులు, మహిళలు, యువకులను ఆకట్టుకుంటోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వారి తరఫున కుటుంబ

సభ్యులు, బంధువులు ప్రచారంలోకి దిగారు. కుమారులు, కూతుర్లు,

కోడళ్లు, అల్లుళ్లు, అన్నా చెల్లెళ్లు,

అక్కా తమ్ముళ్లు.. ఇలా బంధుగణ మంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కుటుంబ సభ్యుల ప్రచార జోరు పెరిగింది. ఎన్నికల ప్రచారం, పర్యవేక్షణతో పాటు ఆర్థిక వ్యవహారాలను కూడా

చూసుకుంటున్నారు. అందరినీ సమన్వయం చేస్తూ తమవారి గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు.

– సాక్షిప్రతినిధి, నల్లగొండ

న్యూఢిల్లీలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇస్తున్న బాలికలు
1/5

న్యూఢిల్లీలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇస్తున్న బాలికలు

2/5

3/5

4/5

5/5

Advertisement

తప్పక చదవండి

Advertisement