కమనీయం.. లక్ష్మీ నారసింహుడి కల్యాణం | Sakshi
Sakshi News home page

కమనీయం.. లక్ష్మీ నారసింహుడి కల్యాణం

Published Thu, May 23 2024 3:55 AM

కమనీయ

తాడూరు: మండలంలోని శిర్సవాడలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారసింహస్వామి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అంతకుముందు ఆలయంలో సుదర్శన హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్తి భరత్‌ ప్రసాద్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రాజేందర్‌రెడ్డి, ఎంపీటీసీ రమేష్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కమనీయం.. లక్ష్మీ నారసింహుడి కల్యాణం
1/2

కమనీయం.. లక్ష్మీ నారసింహుడి కల్యాణం

కమనీయం.. లక్ష్మీ నారసింహుడి కల్యాణం
2/2

కమనీయం.. లక్ష్మీ నారసింహుడి కల్యాణం

Advertisement
 
Advertisement
 
Advertisement