‘జోరుగా హుషారుగా’ విరాజ్‌ అశ్విన్ | Yuvarani Song Launch By Sree Vishnu | Sakshi
Sakshi News home page

‘జోరుగా హుషారుగా’ విరాజ్‌ అశ్విన్

Published Sun, Sep 24 2023 6:12 AM | Last Updated on Sun, Sep 24 2023 6:55 AM

Yuvarani Song Launch By Sree Vishnu - Sakshi

‘ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ’ అంటూ ‘జోరుగా హుషారుగా..’ చిత్రంలోని ‘యువరాణి’ పాట సాగుతుంది. విరాజ్‌ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అనుప్రసాద్‌ దర్శకత్వంలో నిరీష్‌ తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలోని ‘యువరాణి యువరాణి నువ్వు..’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను హీరో శ్రీ విష్ణు రిలీజ్‌ చేసి, ‘‘ఈ సినిమా ఓ జెన్యూన్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణీత్‌ స్వరపరచిన  ‘యువరాణి’ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా అమ్రాన్‌ మాలిక్, నవ్య సమీర పాడారు. ‘‘త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement