When Ranbir Kapoor Fight With Deepika Ex Boyfriend Nihar Pandya - Sakshi
Sakshi News home page

Deepika-Ranbir: 'రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు.. షూటింగ్‌కి ఊటీకి వెళ్తే ఎక్స్‌తో లంచ్‌డేట్‌'

Mar 3 2022 6:15 PM | Updated on Mar 3 2022 7:31 PM

When Ranbir Kapoor Fight With Deepika Ex Boy Friend Nihar Pandya - Sakshi

దీపికా పదుకొణె రణ్‌బీర్ కంటే ముందు నిహార్‌ పాండ్యేను ప్రేమించింది. అయితే కొన్ని కారణాలతో వీరి విడిపోయారు. ఆ తర్వాత దీపిక రణ్‌బీర్‌ ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. అయితే రణ్‌బీర్‌తో డేటింగ్‌ చేసే సమయంలోనే ఆమె తన ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ నిహార్‌ పాండేతోనూ చనువుగా ఉన్నట్లు రణ్‌బీర్‌కు తెలిసిందట. ఓ సినిమా షూటింగ్‌ కోసం రణ్‌బీర్‌ ఊటీకి వెళ్లినప్పుడు దీపికా నిహార్‌తో లంచ్‌డేట్‌కి వెళ్లిందని, దాదాపు రెండు గంటల పాటు వీరి డేట్‌ జరిగిందని సమాచారం.

మరోసారి దీపికా, నిహార్‌లు కలిసి వెళ్తున్నప్పుడు రణ్‌బీర్‌ వాళ్లను చూసి నిహార్‌తో గొడవకు దిగాడట. ఈ క్రమంలో ఇద్దరూ నడిరోడ్డుమీదే కొట్టుకున్నారట. నిహార్  విషయంలో రణ్‌బీర్‌ ఎప్పుడూ అభద్రతా భావంలోనే ఉండేవాడని సన్నిహిత వర్గాల సమాచారం. మరోవైపు రణ్‌బీర్‌ కూడా దీపికాతో లవ్‌లో ఉన్నప్పుడే కత్రినాతో కూడా డేటింగ్‌ చేశాడని, ఓసారి వీరిద్దరి దీపికా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుందని బీటౌన్‌ టాక్‌.

ఆ తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్యా దూరం పెరిగి తమ ప్రేమకు గుడ్‌బై చెప్పేసుకున్నారు. దీపికాతో విడిపోయాక కత్రినా కైఫ్‌తో రణ్‌బీర్‌ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. కానీ ఆ తర్వాత కత్రినాకు కూడా బ్రేకప్‌ చెప్పి ప్రస్తుతం ఆలియాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. అటు దీపికా రణ్‌వీర్‌ సింగ్‌ను వివాహమాడితే, ఆమె ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ నిహార్‌ కూడా సింగర్‌ నీతి మోహన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement