విశ్వక్ సేన్ 'లైలా'.. ట్రైలర్ వచ్చేసింది | Actor Vishwak Sen Latest Movie Laila Trailer Out Now, Watch Video Inside Trending On Social Media | Sakshi
Sakshi News home page

Vishwak sen: లేడీ గెటప్‌లో మాస్‌ కా దాస్.. 'లైలా' ట్రైలర్ వచ్చేసింది

Feb 6 2025 4:58 PM | Updated on Feb 6 2025 5:46 PM

Vishwak sen Latest Movie Laila Trailer Out Now

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్ నటించిన తాజా చిత్రం లైలా. ఈ మూవీ లేడీ పాత్రలో అభిమానులను అలరించనున్నాడు మన యంగ్ హీరో.  రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం రోజున థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో లైలా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. 

ట్రైలర్ చూస్తే అభిమానులకు ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఖాయంగా కనిపిస్తోంది.  లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్‌ నటన అద్భుతమైన ఫర్మామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానున్న ఈ సినిమా ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఫ్యాన్స్‌ను అలరించనుంది. సోనూ మోడల్‌గా మాస్‌ కా దాస్‌ అభిమానులకు లవర్స్‌ డే రోజున అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. ఇంకేందుకు ఆలస్యం లైలా కోసం వెయిట్ చేస్తున్న మజ్నులంతా ట్రైలర్ చూసేయండి. 


 

 

Advertisement
 
Advertisement
Advertisement