విజయ్ దేవరకొండపై అమ్మాయిల వీడియో.. స్పందించిన హీరో! | Vijay Devarakonda Funny Reply To Students, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: విజయ్‌పై అలాంటి వీడియో.. సోషల్ మీడియాలో వైరల్!

Feb 18 2024 3:08 PM | Updated on Feb 18 2024 4:02 PM

Vijay Devarakonda Reply To Students Funny Video Goes Viral - Sakshi

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే యూత్‌లో విజయ్‌కు ఉన్న మామూలు క్రేజ్ లేదు. రౌడీ హీరోగా అభిమానుల్లో గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. అంతే కాదు.. మన హీరో గ్లామర్‌కు అమ్మాయిలు సైతం ఫిదా అవుతుంటారు. అలాంటి గ్లామర్ మనోడి సొంతం. తాజాగా ఈ జాబితాలో విద్యార్థినిలు కూడా చేరిపోయారు. అదేంటో ఓ లుక్కేయండి. 

తాజాగా ఇద్దరు విద్యార్థినిలు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను విజయ్ దేవరకొండ చూసి కామెంట్ చేస్తేనే మేము పరీక్షలకు ప్రిపేర్ అవుతాం అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఇది కాస్తా నెట్టింట పెద్దఎత్తున వైరలవడంతో ఏకంగా విద్యార్థినిలు చేసిన వీడియోకు విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. 'మీరు పరీక్షల్లో 90 శాతం మార్కులు తెచ్చుకుంటే.. కచ్చితంగా మిమ్మల్ని కలుస్తా' అంటూ ఫ్యామిలీ స్టార్‌ హీరో కామెంట్ చేశారు. విద్యార్థినిలు అభిమానంతో వీడియో చేసినా.. విజయ్ స్పందించిన తీరు చూస్తే ఆయన సింప్లీసిటీ ఏంటో అర్థమవుతోంది. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement