ఈ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది: తబిత సుకుమార్ పోస్ట్ వైరల్ | Sukumar wife Thabitha Bandreddi Post On Her wedding anniversery | Sakshi
Sakshi News home page

Thabitha Bandreddi: ఈ 16 ఏళ్లలో లెక్కలేనన్ని జ్ఞాపకాలు: తబిత సుకుమార్

Jun 12 2025 6:05 PM | Updated on Jun 12 2025 7:36 PM

Sukumar wife Thabitha Bandreddi Post On Her wedding anniversery

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ భార్య తబిత తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ 16 ఏళ్లలో లెక్కలేనన్ని జ్ఞాపకాలు,  ప్రేమ మరింత బలపడుతూనే ఉందంటూ తన భర్త, పిల్లలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  ఈ ప్రయాణంలో మమ్మల్ని కలిపి ఉంచిన ఆ దేవుడికి కృతజ్ఞతలు.. మేము ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటామని పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సుకుమార్‌- తబిత జంటకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. టాలీవుడ్ డైరెక్టర్‌ సుకుమార్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించారు. పుష్ప సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేశాడు. తెలుగులో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా తన పేరు సుస్థిరం చేసుకున్నారు. గతేడాది పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టారు.  మరోవైపు టాలీవుడ్‌లో తబిత సుకుమార్‌ నిర్మాతగా రాణిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement