జక్కన్న-మహేశ్‌ మూవీ.. ఆ వార్తల్లో నిజం లేదు!

SSMB29 Movie Makers Clarifies On Storyline Which Is Viral On Social Media - Sakshi

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ ప్రతిష్టాత్మక మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తర్వాత జక్కన్న, మహేశ్‌తో చేయ‌బోయే ఈ ప్రాజెక్టుపై పూర్తి ఫోక‌స్ పెట్ట‌నున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి స్టోరీ లైన్‌కు సంబంధించిన పుకార్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ మూవీ దక్షిణాప్రికా నేపథ్యంలో సాగే ఫారెస్ట్‌ అడ్వంచర్‌గా ఉండోబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రాజమౌళి టీం ఈ మూవీ స్టోరీలైన్‌పై తీవ్ర కసరత్తులు చేస్తొందని, అనంతరం కథను ప్రకటించనున్నట్లు నిర్మాత కేఎల్‌ నారాయణ వెల్లడించారు. అంతేగాక ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29 స్టోరీలైన్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంగా లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top