వేరే అమ్మాయిలతో అల్లరి వేషాలు, నా ప్రేయసి లాగిపెట్టి కొట్టింది | Sakshi
Sakshi News home page

Mika Singh: వేరే అమ్మాయిలతో సింగర్‌ ఫ్లర్టింగ్‌, చెంప చెళ్లుమనిపించిన గర్ల్‌ఫ్రెండ్‌

Published Mon, Jun 27 2022 4:14 PM

Singer Mika Singh: My Girlfriend Gave Tight Slap for Talking to Other Girls - Sakshi

బాలీవుడ్‌ పాపులర్‌ సింగర్‌ మికా సింగ్ తన జీవిత భాగస్వామిని వెతుక్కునే పనిలో పడ్డాడు. 'మికా దీ వోహ్‌తీ' అనే షోతో ఏకంగా స్వయంవరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా ఈ షోలో తన జీవితంలోని ఓ ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకున్నాడు సింగర్‌. గతంలో తనకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉన్న సమయంలో కూడా వేరే అమ్మాయిలతో చిలిపిగా మాట్లాడేవాడినని గుర్తు చేసుకున్నాడు.

'ఆమె ఎంతో అందంగా ఉండేది, నేను తనతో సరసాలాడుతూ మాట్లాడేవాడిని. మన పిల్లలకు సన్నీ, బన్నీ అని పేర్లు పెట్టుకుందాం అని చెప్పాను. అప్పుడు నిజంగా నేను అలానే ఉండేవాడిని. కానీ ఈ విషయాలు నా ప్రియురాలికి తెలియకుండా జాగ్రత్తపడేవాడిని. ఆ అమ్మాయిల పేర్లను రాజేశ్‌, రాకేశ్‌.. అంటూ రకరకాలుగా ఫోన్‌లో సేవ్‌ చేసుకునేవాడిని. ఒకరోజు నా ప్రియురాలు ఇంటికొచ్చేసరికి రాకేశ్‌ అని సేవ్‌ చేసున్న నెంబర్‌ నుంచి అదే పనిగా ఫోన్‌ వస్తూనే ఉంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయమని తను అడిగింది.

నేను ఫోన్‌ ఎత్తగానే అవతలి నుంచి అమ్మాయి గొంతు వినిపించింది. అంతే, తను క్షణం ఆలస్యం చేయకుండా నా చెంప చెళ్లుమనిపించింది. ఇది ప్రారంభం మాత్రమేనని నన్ను బెదిరించింది. నిజానికి అలా చెంపదెబ్బలు తినడం నాకదే మొదటిసారి. కానీ ఆ దెబ్బతో ఆమెకు నామీద ఎంత ప్రేముందో అర్థమైంది. అప్పటినుంచి నేను నిజాయితీగా ఉన్నాను, అలాగే పబ్లిక్‌లో నన్ను లాగిపెట్టి కొడితే నా పరిస్థితేంటని కొంత భయపడ్డాను కూడా! ఎందుకంటే ఎవరున్నారు? ఏంటనేది ఆమె పెద్దగా పట్టించుకోదు కూడా!' అని చెప్పుకొచ్చాడు మికా సింగ్‌.

చదవండి: ఆ సినిమాలో నటించమంటూ హీరోకు రూ.2355 కోట్లు ఆఫర్‌
తల్లిదండ్రులు కాబోతున్న అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement