Sharwanand Engagement To Political Leader Granddaughter On Jan 26th - Sakshi
Sakshi News home page

Sharwanand Engagement : పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న అమ్మాయితో శర్వానంద్‌ పెళ్లి.. డేట్‌ ఫిక్స్‌

Jan 6 2023 2:12 PM | Updated on Jan 6 2023 3:06 PM

Sharwanand Engagement To Political Leader Granddaughter On Jan 26th - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో శర్వా ఏడడుగులు వేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన ఆమెతో శర్వానంద్‌ ఏడడుగులు వేయనున్నారట. ఇప్పటికే పెళ్లి, నిశ్చితార్థం డేట్‌ కూడా దాదాపు ఖాయమైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈనెల26న శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ వేడుక ఘనంగా జరనున్నట్లు సన్నిహితవర్గాలనుంచి సమాచారం అందుతోంది.

ఈ క్రమంలో శర్వానంద్‌ పెళ్లిచేసుకునే అమ్మాయి ఎవరా అన్న ఆరాతీయగా, ఆమె మాజీ మంత్రి మనువరాలు అని తెలుస్తోంది. దీన్నిబట్టి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి శర్వానంద్‌ అల్లుడు కాబోతున్నాడట. కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ జరగనుందట. ఇక పెళ్లి ఏప్రిల్లో ఉంటుంద‌ని.. శ‌ర్వా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement