వేసవిలో శాకుంతలం | shaakuntalam Movie Will Release in April | Sakshi
Sakshi News home page

వేసవిలో శాకుంతలం

Feb 11 2023 1:02 AM | Updated on Feb 11 2023 1:02 AM

shaakuntalam Movie Will Release in April - Sakshi

కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్, శకుంతలగా సమంత నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల కీలక పాత్రలుపో షించారు. ఇప్పటికే రిలీజ్‌ కావాల్సిన ‘శాకుంతలం’ సినిమా రెండుసార్లు వాయిదా పడింది. కాగా ఏప్రిల్‌ 14న ‘శాకుంతలం’ని విడుదల చేయనున్నట్లు శుక్రవారం కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించి, చిత్రంలోని కీలక పా త్రధారులతోపో స్టర్‌ను విడుదల చేశారు.

తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని విజువల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియన్స్‌కు అద్భుతమైన అనుభూతిని ఇచ్చేందుకు హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్‌ రీ రికార్డింగ్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌గారి కుమార్తె అల్లు అర్హ చేసిన యువరాజు భరతుడి పా త్ర ఈ సినిమాకి ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement