'నరేంద్ర మోదీ' బయోపిక్‌లో స్టార్‌ యాక్టర్‌ | Bahubali Fame Actor Sathyaraj To Play Lead In Narendra Modi Biopic |Sakshi
Sakshi News home page

'నరేంద్ర మోదీ' బయోపిక్‌లో స్టార్‌ యాక్టర్‌

May 18 2024 6:23 PM | Updated on May 18 2024 6:50 PM

Sathyaraj In Narendra Modi Biopic

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్‌ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్‌ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్‌ నటించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది.

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్యరాజ్‌కు భారీ పాపులారిటీ తీసుకొచ్చింది.     నరేంద్ర మోదీగా ఈ సినిమాలో సత్యరాజ్  నటించనున్నారని వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంతోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట.

మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్‌లో ఈ సినిమాను ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement