Samantha Injured in Citadel Movie Shooting Set - Sakshi
Sakshi News home page

Samantha: షూటింగ్‌లో సమంతకు గాయాలు, ఫొటో వైరల్‌

Feb 28 2023 1:46 PM | Updated on Feb 28 2023 4:31 PM

Samantha Injured in Citadel Movie Shooting Set - Sakshi

ఇటివలె మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సమంత తాజాగా షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె తన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ మొదలు పెట్టింది. ఈ క్రమంలో తనపై పలు యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తుండగా సమంత గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సామ్‌ వెల్లడించారు. షూటింగ్‌ గాయపడంతో తన రెండు చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతులకు గాయాలైన ఫొటోను ఈ సందర్భంగా సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు. యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా తన రెండు చేతులకు గాయాలైనట్లు సమంత వెల్లడించారు. 

చదవండి: పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: సీనియర్‌ నటి

గతేడాది యశోద మూవీ చిత్రంతో అలరించిన ఆమె సినిమా రిలీజ్‌కు ముందు మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. దీంతో తీవ్ర అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సామ్‌ ఇటీవల మయోసైటిస్‌ కోలుకున్నారు. తిరిగి తన మూవీ షూటింగ్స్‌ ప్రారంభించిన సామ్‌ మొదట సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ సెట్‌లో అడుగుపెట్టింది. దీనిని ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ డైరెక్టర్స్‌ రూసొ బ్రదర్స్‌ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామ్‌పై ప్రస్తుతం యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా సమంతకు చేతికి గాయాలయ్యాయి. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement