'ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం'.. ఆసక్తిగా ట్రైలర్! | Raja Ravindra Latest Movie Sarangadhariya Trailer Out Now | Sakshi
Sakshi News home page

మిడిల్ క్లాస్ కష్టాలను చూపించే 'సారంగదరియా'.. ట్రైలర్ రిలీజ్‌ చేసిన హీరో!

Jul 4 2024 7:38 PM | Updated on Jul 4 2024 7:48 PM

Raja Ravindra Latest Movie Sarangadhariya Trailer Out Now

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర, శివకుమార్, యశస్విని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సారంగదరియా'. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌కు ఆడియన్స్ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్‌లో రాజా రవీంద్ర నటన ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, ఉపాధ్యాయుడి పాత్రలో ఆయన కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ కష్టాలను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్ తెగ హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, మొయిన్ మొహ‌మ‌ద్‌ ,మోహిత్ పేడాడ‌, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement