రూ.100 కోట్ల డబ్బు ఎక్కడ దాచారు?

Rahul Tyson 100 Crores Movie Teaser Released - Sakshi

సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ నిర్మించిన చిత్రం ‘100 క్రోర్స్‌’. ‘హ్యాపీ డేస్‌’ ఫేమ్‌ రాహుల్‌ టైసన్, చేతన్, ఎమీ, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటించారు. విరాట్‌ చక్రవర్తి దర్శకత్వంలో దివిజ సమర్పణలో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. హై సెక్యూరిటీలో ఉండే వంద కోట్ల డబ్బును ఎవరు కొట్టేశారు? ఎక్కడ దాచారు? ఆ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేంటి? అన్నది చిత్రకథ. మా సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రీకాంత్‌ దీపాల, కథ, సంగీతం: సాయి కార్తీక్‌. 

చదవండి: 'కథ వేరేలా ఉందే'.. అనిల్‌ రావిపూడిని కలిసిన సోహైల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top