ముక్కు సర్జరీ వికటించింది.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా | Priyanka Chopra Says She Went Depression After Nose Surgery Went Wrong | Sakshi
Sakshi News home page

Priyanka Chopra : 'ప్లాస్టిక్‌ సర్జరీ.. నా ముక్కు అలా అవడంతో సినిమాల్లోంచి తీసేశారు'

May 4 2023 2:20 PM | Updated on May 4 2023 3:11 PM

Priyanka Chopra Says She Went Depression After Nose Surgery Went Wrong - Sakshi

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధన్యత ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెరపై మరింత అందంగా కనిపించేందుకు హీరో,హీరోయిన్లు చాలా ప్రయోగాలు చేస్తుంటారు. జిమ్‌లో గంటలకొద్దీ వర్కవుట్స్‌, స్క్రిక్ట్‌ డైట్‌..ఇలా ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఏకంగా సర్జీరల బాట కూడా పట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు, బోలెడంత మంది హీరోయిన్లు కృత్రిమ పద్దతులను ఉపయోగించి ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్నారు. వారిలో కొందరు సర్జరీ తర్వాత మరింత అందంగా తయారైతే, మరికొందరికి ఆ సర్జరీలు వికటించి  ఉన్న అందం పోగోట్టుకున్నారు.

గ్లోబల్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన ముక్కు, పెదాలకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది. అయితే ముక్కు సర్జరీ మాత్రం వికటించి డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే ఒప్పుకుంది. ఇటీవల ఓ షోకు హాజరైన ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

''ఇది జరిగి సుమారు 20ఏళ్లవుతుంది. ఒకానొక సమయంలో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. జలుబు కూడా చాలాకాలం వరకు తగ్గలేదు. దీంతో డాక్టర్‌ దగ్గరకు వెళ్తే నాసికా కుహరంలో పాలిప్‌ను తొలగించాలని సిఫార్సు చేశారు. అయితే అనుకోకుండా ముక్కు పైన ఉ‍న్న చిన్న భాగాన్ని ఆపరేషన్‌ చేసి తొలగించారు. దీంతో నా ముఖం అంతా మారిపోయింది. అప్పటికే నేను కొన్ని సినిమాలు సైన్‌ చేశాను. కానీ నా ముఖంలో సర్జరీ తాలూకూ మార్పులు స్పష్టంగా తెలిసిపోయి కాస్త అందవిహీనంగా తయారయ్యాను. దీంతో నన్ను 3 సినిమాల్లో తీసేశారు.

అంతేకాకుండా ఓ సినిమాలో హీరోయిన్‌ రోల్‌కు కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించాల్సి వచ్చింది. ఇలా చేతికి వచ్చిన అవకాశాలు అన్నీ పోతున్న సమయంలో చాలా డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. కెరీర్‌ ముగుస్తుందని చాలా బాధపడ్డాను. అప్పుడు మా నాన్న నాకు అండగా నిలిచారు. ముక్కును కరెక్ట్‌ చేసుకునేందుకు కాస్మొటిక్‌ సర్జరీ చేయించుకోమని నన్ను ప్రోత్సహించారు. అలా మళ్లీ ఆ సర్జరీతో కాన్ఫిడెన్స్‌ వచ్చింది'' అంటూ  చెప్పుకొచ్చింది ప్రియాంక. 

Advertisement
 
Advertisement
Advertisement