Trisha Krishnan Reacts On Her Marriage - Sakshi
Sakshi News home page

Trisha: 'అందరూ అలాంటి ప్రశ్నలే అడిగి ఇబ్బంది పెడతారు'

Oct 10 2022 3:00 PM | Updated on Oct 10 2022 3:45 PM

Ponniyin Selvan Beauty Trisha Krishnan Reacts On Marraige - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ త్రిష దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది. 40కి చేరువవుతున్నా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా సత్తాచాటుతుంది. ఇటీవలె లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలో కుందవై పాత్రలో నటించి మెప్పించింది. ఐశ్వర్యరాయ్‌ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే ప్రమోషన్స్‌లోనూ ఐష్‌ను డామినేట్‌ చేసేలా త్రిష ఎంతో అందంగా కనిపించింది.

ఈ క్రమంలో త్రిష పెళ్లి విషయం మరోసారి తెరమీదకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై త్రిష మాట్లాడుతూ.. 'నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు. కానీ వాళ్లు అడిగే విధానం నాకు అస్సలు నచ్చదు. త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని అడగడం ఓకే కానీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించడం కరెక్ట్‌ కాదు. ఇది నా వ్యక్తిగతం. పెళ్లెప్పుడు అంటే చెప్పలేదు.

ఎందుకంటే నాతో జీవితాంతం కలిసి ఉండే వ్యక్తొ దొరకాలి. నా ఫ్రెండ్స్‌, సన్నిహితుల్లో చాలామంది పెళ్లి చేసుకొని సంతృప్తిగా లేరు. పిల్లల కోసమో, కుటుంబం కోసమో కలిసుంటున్నారు. ఇంకొంత మంది ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. అలా మధ్యలో ముగిసిపోయే బంధాలు నాకు వద్దు. అందుకే నా పెళ్లి ఆలస్యం అవుతోంది' అంటూ త్రిష చెప్పుకొచ్చింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement