బాలకృష్ణ కారుకు ఫ్యాన్సీ నంబర్‌.. ఎన్ని లక్షలో తెలుసా..? | Nandamuri Balakrishna New Car Fancy Number Cost | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ కారుకు ఫ్యాన్సీ నంబర్‌.. ఎన్ని లక్షలో తెలుసా..?

Apr 20 2025 7:01 AM | Updated on Apr 20 2025 11:07 AM

Nandamuri Balakrishna New Car Fancy Number Cost

ప్రత్యేక నంబర్‌లపై తెలంగాణ ఆర్టీఏ  నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో ఎమ్మెల్యే, సినీనటుడు  బాలకృష్ణ పోటీ పడ్డారు. రూ.7.75 లక్షలు చెల్లించి ‘టీజీ 09 ఎఫ్‌0001’ నంబర్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా ఆయన కొన్న బీఎండబ్ల్యూ వాహనం కోసం పోటీపడి ఈ నంబర్‌ను దక్కించుకున్నారు. రూ.లక్షకు పైబడి పలికిన ఫ్యాన్సీ నంబర్లతో వచ్చిన ఆదాయం వివరాలను జేటీసీ రమేష్‌ వెల్లడించారు. శనివారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో అత్యధిక మొత్తంలో చెల్లించిన వ్యక్తిగా బాలయ్య ప్రథమస్థానంలో ఉన్నారు.  

ఆ తర్వాత కమలాలయ హిల్‌ సాఫ్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పోటీలో రూ.6,70,000 చెల్లించి ‘టీజీ 09ఎఫ్‌ 0009’ను దక్కించుకుంది. ‘టీజీ09 ఎఫ్‌ 9999’ నంబర్‌కు ఎకోడిజైన్‌ స్టూడియో రూ.99,999 చెల్లించి సొంతం చేసుకుంది. జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌’ ‘టీజీ09 ఎఫ్‌0005’ కోసం రూ.1,49,999 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీజీ09ఎఫ్‌ 0007’ నంబర్‌ కోసం కె.శ్రీనివాస్‌నాయుడు రూ.1,37,779 చెల్లించారు. ‘టీజీ09ఎఫ్‌ 0019’కు నేత్రావతి బలగప్ప శివాలినిప్ప రూ.60,000 చెల్లించారు. ‘టీజీ 09ఎఫ్‌ 0099’ కోసం కాన్‌క్యాప్‌ ఎలక్ట్రికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.4,75,999 చెల్లించింది. ఖైరతాబాద్‌ జోన్‌లో శనివారం నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో ప్రత్యేక నంబర్లపై రూ.37,15,645 లభించినట్లు హైదరాబాద్‌ జేటీసీ రమేష్‌  తెలిపారు. 

 

కూతురు గిఫ్ట్‌గా ఇచ్చిన కారుకు కూడా ఇదే నంబర్‌
బాలకృష్ణ వద్ద సుమారు 5కు పైగానే లగ్జరీ కార్లు ఉన్నాయి. డాకూ మహరాజ్‌ సినిమా తర్వాత కొన్న కారు కోసమే ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్‌ దక్కించుకున్నారు. అయితే, గతేడాదిలో ఆయన కూతురు బ్రాహ్మణి  బెంట్లి కాంటినెంటల్‌ కారుని బాలయ్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లగ్జరీ కారు ధర రూ.3.30 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం 3.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 329 కి.మీ. ఉంది. ఆయన వద్ద  బీఎండబ్ల్యూ 6 సీరిస్‌ జీటి, మెర్సిడెస్‌ బెంజ్‌ GLS 400d, టయోట ఇన్నోవా క్రిస్టా కార్లు ఉన్నాయి. వాటి అన్నింటికి కూడా 0001 ఫ్యాన్సీ నంబర్లే ఉన్నటం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement