చిన్నారులకు గోల్డెన్ ఛాన్స్‌.. ప్రకటించిన కల్కి డైరెక్టర్‌! | Kalki 2898 AD Movie Director Nag Ashwin Gives Golden Chance To Visit Movie Sets For Children, Post Viral | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Movie: చిన్నారులకు క్రేజీ ఛాన్స్‌.. కల్కి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌

Jul 19 2024 6:39 PM | Updated on Jul 19 2024 6:56 PM

Kalki Director Nag Ashwin Gives Golden Chance To Visit Movie Sets

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో నాగ్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

చిన్నారులకు కల్కి మూవీ సెట్‌ చూసే అవకాశం కల్పించనున్నట్లు నాగ్ అశ్విన్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. అయితే చిన్నారికి సంబంధించి కల్కి సినిమాపై ఓ వీడియోను పంపించాలని ఆయన కోరారు. వీటిలో ఎంపికైన వారికి కల్కి సెట్ చూసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మరి ఎందుకు ఆలస్యం వెంటనే మీ చిన్నారుల వీడియోలు పంపి.. అరుదైన ఛాన్స్‌ కొట్టేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement