అభిమానులకు దేవర స్పెషల్ విషెస్! | Jr NTR Special Wishes To Fans On This Pongal Occassion | Sakshi
Sakshi News home page

Jr NTR: అభిమానులకు దేవర సంక్రాంతి శుభాకాంక్షలు!

Jan 14 2024 11:01 AM | Updated on Jan 14 2024 11:17 AM

Jr NTR Special Wishes To Fans On This Pongal Occassion - Sakshi

తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ విష్ చేశారు. పండుగ సందర్భంగా ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం యంగ్ టైగర్‌కు విషెస్ చెబుతున్నారు. 

కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి ముద్దుల కూతురు. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దేవరకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్‌ కాగా..  ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్‌లో సముద్రంలో ఫైట్ సీన్‌ను చూసిన ఫ్యాన్స్‌ దేవర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement