దేవర ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పిన మేకర్స్.. ‍అదేంటంటే? | Jr Ntr Movie Devara Part 1 Newaly Added The Super Hit Song In Theatres | Sakshi
Sakshi News home page

Devara Movie: దేవర ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ‍అదేంటో తెలుసా!

Oct 4 2024 5:52 PM | Updated on Oct 4 2024 6:29 PM

Jr Ntr Movie Devara Part 1 Newaly Added The Super Hit Song In Theatres

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటేడ్‌ చిత్రం దేవర పార్ట్‌-1. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలివారంలో ఏకంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో దేవర చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మూవీ టీం సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

అయితే దేవర చిత్రంలో ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసిన విషయం ఆ ఒక్కటే. మాస్ సాంగ్‌ దావూది సాంగ్‌ థియేటర్లో రాకపోవడంతో డైహార్డ్‌ ఫ్యాన్స్‌ తెగ ఫీలయ్యారు. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ సాంగ్‌ను యాడ్ చేసినట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచే బిగ్‌ స్క్రీన్‌పై దాపూది సాంగ్‌ చూసేయండి అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించింది. నటుడు సైఫ్ అలీ ఖాన్‌ విలన్‌ పాత్రలో మెప్పించారు. ఇందులో ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషించారు. కాగా.. దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్‌ సంగీతమందించారు.

Advertisement
 
Advertisement
Advertisement