ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్‌ మూవీ, మరో థ్రిల్లర్‌ సిరీస్‌ కూడా! | Journey of Love 18, Bombay Meri Jaan OTT Date Is Here | Sakshi
Sakshi News home page

OTT: ఒకేరోజు ఓటీటీలో రెండు సినిమాలు. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే?

Sep 10 2023 2:33 PM | Updated on Sep 10 2023 2:54 PM

Journey of Love 18, Bombay Meri Jaan OTT Date Is Here - Sakshi

ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌కు సబంధించిన కంటెంట్‌ను ఇష్టపడతారు. అందుకే మేకర్స్‌ కూడా ఈ తరహా సినిమాలు, సిరీస్‌లపైనే ఎక్కువగా దృష్టి

సినిమా సినిమానే.. ఓటీటీ ఓటీటీనే! వీకెండ్‌లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాం కదా అని ఓటీటీలో మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ చూడకుండా ఉండలేం కదా! అందుకే ఓటీటీలు సినీప్రియులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తూనే ఉంది. ప్రతివారం ఏదో ఒక ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రిలీజవుతూనే ఉన్నాయి. ఇప్పటికే భోళా శంకర్‌ సెప్టెంబర్‌ 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యేందుకు రెడీ అయింది.

తాజాగా మరో సినిమా అదే రోజు రిలీజ్‌ అయ్యేందుకు సంసిద్ధమైంది. అదే 'జర్నీ ఆఫ్‌ లవ్‌ 18+'. నస్లీన్‌ కె.గపూర్‌, మాథ్యూ థామస్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అరుణ్‌ డి.జోస్‌ దర్శకత్వం వహించాడు. మలయాళంలో జూలై 7న రిలీజైన ఈ చిత్రం అక్కడి యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీని సోనీలివ్‌లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి ఈ చిత్రం సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌కు సబంధించిన కంటెంట్‌ను ఇష్టపడతారు. అందుకే మేకర్స్‌ కూడా ఈ తరహా సినిమాలు, సిరీస్‌లపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అలా రూపొందిన వెబ్‌ సిరీసే 'బంబై మేరీ జాన్‌'. 1960లో ముంబై పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ సిరీస్‌ నడుస్తుంది. షుజాత్‌ సౌదాగర్‌ డైరెక్ట్‌ చేసిన బంబై మేరీ జాన్‌ సిరీస్‌లో కేకే మీనన్‌, అవినాశ్‌ తివారి ప్రధాన పాత్రలు పోషించారు. నివేదిత భట్టాచార్య, అమైరా దస్తూర్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రానుంది.

చదవండి: ఆ హీరో నా కొడుకే, కానీ మా మధ్య ఆ అనుబంధం లేదు.. కలిసి దిగిన ఫోటో ఒక్కటీ లేదు!

Advertisement
 
Advertisement
Advertisement