Janhvi Kapoor to star opposite Ram Charan in Buchi Babu next film - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor : గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో జాన్వీ కపూర్‌

Apr 17 2023 5:35 PM | Updated on Apr 17 2023 6:30 PM

Janhvi Kapoor To Star Opposite Ram Charan In Buchi Babu Next Film - Sakshi

దివంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌లో NTR30 అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుంది. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే జాన్వీ కపూర్‌కు మరో క్రేజీ ఆఫర్‌ దక్కిందట.

ఉప్పెన సినిమాతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన బుచ్చిబాబు- రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో మరో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement