Emma Watson: Reacts To Mistake Of Harry Potter Hogwarts Reunion - Sakshi
Sakshi News home page

Emma Watson: నిర్వాహకుల పొరపాటుపై హీరోయిన్‌ స్పందన.. అది నేను కాదు కానీ

Jan 7 2022 5:05 PM | Updated on Jan 7 2022 7:54 PM

Emma Watson Reacts To Mistake Of Harry Potter Hogwarts Reunion - Sakshi

Emma Watson Reacts To Mistake Of Harry Potter Hogwarts Reunion: అప్పుడప్పుడూ సినీ సెలబ్రిటీలు, చిత్ర యూనిట్ సభ్యులు తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి గమనించిన నెటిజన్లు మాత్రం కావాలనే ట్రోల్‌ చేస్తుంటారు. సెటైర్లు వేస్తుంటారు. నెటిజన్ల క్రియేటివిటీని చూసి తారలు, చిత్ర బృంద తమదైన శైలీలో స్పందిస్తారు. ఇంతకుముందు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఐటమ్ సాంగ్‌ గురించి కామెంట్‌ చేసిన ఒక యూజర్‌కు 'నువ్‌ యాక్ట్‌ చేస్తావా' అని ఆ ఆర్‌ఆర్‌ఆర్‌ ట్విటర్‌ గ్రూప్‌ అడ్మిన్‌ స్పందించిన తీరు ఎంతోమందికి నవ్వు తెప్పిచ్చింది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్‌ 20వ వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) హెచ్‌బీవో మ్యాక్స్‌ నిర్వహించింది. 

ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్‌

'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్‌ టు హాగ్వార్ట్‌' (Hogwarts Reunion) పేరుతో టెలీకాస్ట్‌ చేసిన స్పెషల్‌ ఎపిసోడ్‌లో ఎమ్మా వాట్సన్‌కు బదులు ఎమ్మా రాబర్ట్స్‌ చిన్నప్పటి ఫొటో పెట్టి పొరపాటు చేశారు నిర్వాహకులు. దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పొరపాటుపై స్పందించింది ఎమ్మా వాట్సన్‌. మీక్కీ మౌస్‌ చెవులను ధరించిన ఎమ్మా రాబర్ట్స్‌ చిన్నప్పటి పిక్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేస్తూ 'ఈ క్యూట్‌గా ఉన్నది నేను కాదు' అని క్యాప్షన్‌ ఇచ్చింది. అలాగే #వాట్సన్‌సిస్టర్స్‌ఫరెవర్‌ అని హ్యాష్‌ట్యాగ్‌ యాడ్‌ చేసింది. 


ఇదీ చదవండి: స్పానిష్‌ నటి ఇంట్లో వినాయకుడి చిత్రపటం.. వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement