Sohel Crying in Bigg Boss 4 Telugu Show | కావాల‌ని చేయ‌లేదంటూ సోహైల్ క‌న్నీరుమున్నీరు - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: ఆ కార‌ణంతో సోహైల్ కంట‌త‌డి

Dec 9 2020 8:44 PM | Updated on Dec 10 2020 1:21 PM

Bigg Boss 4 Telugu: Sohel Confesses His Anger With Tears - Sakshi

ఎమోష‌న్స్ అణుచుకుంటే న‌టిస్తున్నావంటారు. అలా అని వాటిని అతిగా బ‌య‌ట‌పెడితే తప్ప‌ని నిందిస్తారు. ప్ర‌స్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న‌ సోహైల్ ప‌రిస్థితి కూడా ఇలాంటిదే. అత‌డో యాంగ్రీ బ‌ర్డ్‌. ముక్కు మీద కోపం ఉంటుంది కానీ మ‌న‌సు నిండా ప్రేముంటుంది. ఉవ్వెత్తున ఎగిసిప‌డే అత‌డి కోపం చిచ్చుబుడ్డిలా చ‌ప్పున చ‌ల్లారిపోతుంది. ఇప్ప‌టికే అతడు చాలా మారాడు. నాగార్జున‌కు ఇచ్చిన మాట కోసం కోపాన్ని జ‌యించాడు. కొన్ని సంద‌ర్భాల్లో మాత్ర‌మే త‌న ముందు జ‌రుగుతున్న త‌ప్పును స‌హించ‌లేక విరుచుకుప‌డేవాడు. కానీ మ‌రుక్ష‌ణ‌మే ఎందుకు అరిచానా? అని ఎదుటివారి క‌న్నా ఎక్కువ‌గా బాధ‌ప‌డ‌తాడు. దీంతో త‌న‌లోని కోప‌మ‌నే ఎమోష‌న్‌ను అణుచుకోలేక లోలోప‌ల న‌ర‌కం అనుభ‌విస్తున్నాడ‌ని తాజా ప్రోమోను చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. నిన్న‌టి ఓపిక టాస్క్‌లో అరియానా మోనాల్ మీద విరుచుకుప‌డ్డ‌ విష‌యం తెలిసిందే క‌దా! ఆమె మాట‌ల‌తో మోనాల్ ఒంట‌రిగా గుక్క‌పెట్టి మ‌రీ ఏడ్చింది. (చ‌ద‌వండి: అఖిల్ ప్రేమ కావాలి: మోనాల్‌)

ఒక బ్ర‌ద‌ర్‌గా ఆమె బాధ చూడ‌లేక‌పోయిన‌ సోహైల్ అరియానా మీద విరుచుకుప‌డ్డాడు. కానీ క‌న్ఫెష‌న్ రూమ్‌లో మాత్రం త‌న కోపానికి త‌నే బాధ‌ప‌డ్డాడు. నాలో కోప‌మొక్క‌టే మైన‌స్ త‌ప్ప మ‌రేం లేద‌ని చెప్పాడు. ఆమెతో గొడ‌వ‌పెట్టుకోవాల‌ని లేదు కానీ అలా జ‌రిగిపోతుంద‌ని ఏడ్చాడు. ఏమీ అర్థం కావ‌డం లేదంటూ అయోమ‌యానికి లోన‌య్యాడు. నాకు బిగ్‌బాస్ చాలా ముఖ్య‌మ‌ని చెప్పుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. సోహైల్‌ కంట‌త‌డి పెట్టుకోవ‌డాన్ని చూసి ఆయ‌న అబిమానులు ఉద్వేగానికి లోన‌వుతున్నారు. నీ కోపం క్ష‌ణ‌కాల‌మ‌ని మాకు తెలుసంటూ బాస‌ట‌గా నిలుస్తున్నారు. ఇక సోహైల్ క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి వ‌చ్చాడంటే ఓపిక టాస్క్‌లో అత‌డే గెలిచిన‌ట్లు తెలుస్తోంది. అందువల్లే అత‌డు నేరుగా ప్రేక్ష‌కుల‌తో మాట్లాడే అవ‌కాశాన్ని పొందిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. (చ‌ద‌వండి: మోనాల్ మ‌న‌సులో నేనున్నా అంది: అభి)

Advertisement
 
Advertisement
Advertisement