Watch: Varun Dhawan Bhediya Movie Chilipi Varaale Ivvu Lyrical Song Video Out - Sakshi
Sakshi News home page

Thodelu Movie: 'చిలిపి వరాలే ఇవ్వు'మని అంటోన్న వరుణ్‌ ధావన్‌

Nov 7 2022 5:54 PM | Updated on Nov 7 2022 7:09 PM

Bhediya: Chilipi Varaale Ivvu Song Out Now - Sakshi

తుమ్కేశ్వరి' అనే మొదటి పాట ఇటీవల విడుదలవగా దీనికి విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో భేదియా టీం ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" సంస్థ ఇటీవలే కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. తాజాగా బాలీవుడ్‌ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న "భేదియా" చిత్రంతో  మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతోంది. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా "భేదియా". ఈ చిత్రం నుంచి 'తుమ్కేశ్వరి' అనే మొదటి పాట ఇటీవల విడుదలవగా దీనికి విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో భేదియా టీం ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.

భేదియా చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిలిపి వరాలే ఇవ్వు  పాటను కార్తీక్ ఆలపించారు. ఈ చిత్రానికి అమితాబ్ భట్టాచార్య, యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన భేదియా హిందీ, తమిళం, తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా "భేదియా"ను 'తోడేలు' పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు.

చదవండి: కారు ప్రమాదం తర్వాత రంభ ఫ్యామిలీ ఎలా ఉందో చూశారా?

కన్నడ ప్రేక్షకులకు లేఖ రాసిన పునీత్‌ భార్య

Advertisement
 
Advertisement
Advertisement