నటుడు అజిత్‌కు ప్రమాదం | Ajith Kumar escapes unhurt after racing car crash during high-speed endurance event in Europe | Sakshi
Sakshi News home page

నటుడు అజిత్‌కు ప్రమాదం

Aug 24 2026 5:08 AM | Updated on Aug 24 2026 5:27 AM

Ajith Kumar escapes unhurt after racing car crash during high-speed endurance event in Europe

సాక్షి, చెన్నై: తమిళ నటుడు అజిత్‌ కుమార్‌ మరోసారి కార్‌ రేసింగ్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వెండితెరపైనే కాకుండా అంతర్జాతీయ మోటార్‌ స్పోర్ట్స్‌ రేసింగ్‌లోనూ రాణిస్తున్న అజిత్‌.. ఇటీవల రేసింగ్‌ పేరిట సొంత జట్టును ఏర్పాటు చేసి అంతర్జాతీయ రేసుల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూరప్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక లే మాన్స్‌ ఛాంపియన్‌షిప్‌ రేసులో అజిత్‌ బృందం పోటీ పడుతోంది. 

రేసు అత్యంత వేగంగా సాగుతున్న సమయంలో, సాంకేతిక లోపం కారణంగా అజిత్‌ నడుపుతున్న కారు చక్రాలు వరుసగా విఫలమై, అకస్మాత్తుగా అదుపు తప్పి మరొక కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజిత్‌ సురక్షితంగా బయటపడ్డారు. గతంలోనూ అజిత్‌ ఇటలీ, స్పెయిన్, మలేషియా, దుబాయ్‌ వంటి దేశాల్లో జరిగిన కార్‌ రేసింగ్‌లు, శిక్షణ సమయాల్లో పలు ప్రమాదాలకు గురై స్వల్ప గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement