అందుకే నన్ను పంపించేశారు.. అతనంటే భయమా?: ఆట సందీప్ | Bigg Boss 7 Telugu Contestant Aata Sandeep Comments On Pallavi Prashanth Goes Viral - Sakshi
Sakshi News home page

Aata Sandeep: 'పాపం రా.. ఎందుకు పక్కన పెట్టేశారు?.. అతనంటే అంతా భయమా?'

Nov 2 2023 7:08 PM | Updated on Nov 3 2023 10:24 PM

Aata Sandeep Comments On Pallavi Prashanth Goes Viral - Sakshi

ఉల్టా పుల్టా అంటూ మొదలైన బిగ్ బాస్ షో అభిమానులను అలరిస్తోంది. ఈ వారంలో హౌస్‌మేట్స్ మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నామినేట్ చేసే సమయంలో కంటెస్టెంట్స్ మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఈసారి కూడా మరింత హాట్‌హాట్‌గా మారిపోయింది. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవ్వడంతో బిగ్ బాస్  ఈ వారం కెప్టెన్సీ కంటెండ‌ర్ కోసం కంటెస్టంట్స్‌కు గేమ్ టాస్కులు ఇచ్చాడు.  ఇంటి స‌భ్యుల‌ను రెండు టీమ్‌లుగా విభ‌జించాడు. వీర‌సింహాలు టీమ్‌లో యావ‌ర్‌, గౌత‌మ్‌, భోలె, తేజ‌, శోభా, ర‌తిక ఉండ‌గా.. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ, ప్రియాంక, అర్జున్, అశ్విని గ‌ర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు.

రైతుబిడ్డ అవుట్!

అయితే రెండు టీమ్స్‌కు బిగ్‌బాస్ మొద‌ట జంపింగ్ జ‌పాంగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీర‌సింహాలు టీమ్ గెలవ‌డంతో వీరికి అవ‌త‌లి టీమ్‌లో ఒక‌రిని గేమ్ నుంచి తొల‌గించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అంద‌రూ మాట్లాడుకుని పల్లవి ప్ర‌శాంత్‌ను గేమ్ నుంచి తప్పించారు. త‌న‌ను ఆట‌లో నుంచి ప‌క్క‌కు తోసేయ‌డంతో రైతుబిడ్డ ఏడ్చేశాడు. శివాజీ త‌న చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్ర‌శాంత్ మెడ‌లో వేయించారు. 

అతనంటే భయమా?

అయితే తాజాగా పల్లవి ప్రశాంత్‌ను గేమ్ నుంచి తప్పించడంపై ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పాపం రా.. ప్రశాంత్ మంచి ప్లేయర్ ఎందుకు గేమ్ నుంచి పక్కన పెట్టారు. అతనంటే భయపడుతున్నారా? అందుకే గేమ్ నుంచి తప్పించారా? అని ప్రశ్నించారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ను పక్కన పెడితే గేమ్‌లో అసలు కిక్కే ఉండదు అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. గేమ్‌లో గట్టి పోటీనిచ్చేవారితోనే ఆడాలి..నేను స్ట్రాంగ్ ప్లేయర్ అయినందుకే నన్ను హోస్ నుంచి బయటికి పంపారు.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement