ప్రియురాలితో మూడో పెళ్లి.. అతిథులకు ప్రత్యేక మెను..! | Aamir Khan wedding with girlfriend Gauri Spratt on July 5 food menu | Sakshi
Sakshi News home page

Aamir Khan: ప్రియురాలితో మూడో పెళ్లి.. అతిథులకు ప్రత్యేక మెను..!

Jul 3 2026 6:33 PM | Updated on Jul 3 2026 7:08 PM

Aamir Khan wedding with girlfriend Gauri Spratt on July 5 food menu

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈనెల 5న తన ప్రియురాలు, బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను పెళ్లాడనున్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే జరగనుందని వెల్లడించారు. ఈ వివాహాన్ని ‍అత్యంత దగ్గరి బంధువులతోనే చాలా సీక్రెట్‌గా జరుపుకోనున్నారు. 

ఈ పెళ్లికి కేవలం 100-150 మంది మాత్రమే అతిథులు మాత్రమే హాజరవుతారని అమిర్ ఖాన్ సన్నిహితులు తెలిపారు.  ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తైనట్లు వెల్లడించారు. అతిథులకు ప్రత్యేక భోజనాల మెను సిద్ధం చేసినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. అమిర్, గౌరీ మెను విషయంలో తమకు ఇష్టమైన వంటకాల తయారీని స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. వీరిద్దరు ‍అతిథులకు ఇచ్చే విందు స్పెషల్‌గా ఉండాలని భావిస్తున్నారట.

ఈ పెళ్లికి అమిర్ ఖాన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు చిత్రనిర్మాత అశుతోష్ గోవారికర్, డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి కూడా హాజరవుతారని తెలుస్తోంది. కాగా.. ‍అమిర్  గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement