విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Published Wed, Nov 15 2023 1:36 AM

- - Sakshi

● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సంతోష్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌/బెల్లంపల్లి: ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బీ సంతోష్‌ హెచ్చరించారు. మంగళవారం మంచిర్యాల, బెల్లంపల్లి రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లో రికార్డులు, రిజిష్టర్లు, ఎన్నికల సామగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓటు విలువ, ఆవశ్యకతను వివరించాలని తెలిపారు. జిల్లాలో ఓటరు స్లిప్పుల పంపిణీపై కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతీ ఉద్యోగి సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ రాహుల్‌, మంచిర్యాల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో రాములు, నోడల్‌ అధికారి నీరటి రాజేశ్వరి, మంచిర్యాల, దండేపల్లి, నస్పూర్‌, బెల్లంపల్లి తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement