సకాలంలో పనులు పూర్తి చేయాలి | Sakshi
Sakshi News home page

సకాలంలో పనులు పూర్తి చేయాలి

Published Tue, Apr 23 2024 8:20 AM

రాజురా పాఠశాలను పరిశీలిస్తున్న   కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, అధికారులు - Sakshi

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ● అధికారులతో కలిసి పలు పాఠశాలలు సందర్శన

ఆసిఫాబాద్‌/వాంకిడి: ప్రభుత్వ పా ఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే సంబంధిత అధికా రులను ఆదేశించారు. సోమవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన బిల్లులు/పనులు పెండింగ్‌ కథనానికి స్పందించి ఆసిఫాబాద్‌ మండలం రాజురా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలతోపాటు వాంకిడి మండలంలోని బోర్డా ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో అభివృద్ధి పనులు మే 20లోగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో పెండింగ్‌ పనులను సైతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యాశాఖ అధికారులు రోజువారీగా పనులు పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఈవో అశోక్‌, సెక్టోరల్‌ అధికారి భరత్‌కుమార్‌, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, ఇంజినీరింగ్‌ అధికారులు శ్రీనివాస్‌, గిరీశ్‌, సీసీలు రాధ, రమేశ్‌, కార్యదర్శి రాందాస్‌, జిమ్నాజీ తదితరులు ఉన్నారు.

ఎఫెక్ట్‌

1/1

Advertisement
 
Advertisement