ఐటీఐ ఎన్టీసీ పొందటానికి అవకాశం | Sakshi
Sakshi News home page

ఐటీఐ ఎన్టీసీ పొందటానికి అవకాశం

Published Wed, Apr 17 2024 1:50 AM

-

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల్లో పనిచేస్తూ అర్హత కలిగిన ప్రైవేట్‌ అభ్యర్థిగా ఐటీఐ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌టీసీ) పొందటానికి అవకాశం కల్పిస్తున్నట్లు మంచిర్యాల ఐటీఐ ప్రిన్సిపాల్‌ చందర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐకి సంబంధించిన ఏదేని ట్రేడ్‌లో అనుభవమున్న అభ్యర్థులకు సంబంధిత ట్రేడ్‌ పరీక్షలకు (ఆలిండియా ట్రేడ్‌ టెస్ట్‌ (ఏఐఐటీ)కు హాజరయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఐటీఐలో ఏదైనా ట్రేడ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలో ఎస్సెస్సీ ఉత్తీర్ణులై, మూడేళ్లు ఆయా ట్రేడ్‌లలో అనుభవం కలిగి ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ కలిగినవారికి ఎన్టీసీ పొందటానికి వీలుందని వివరించారు. నాలుగు కేటగిరీలకు సంబంధించిన అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోపు ములుగురోడ్‌లో గల కార్యాలయంలో వరంగల్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ను నేరుగా కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పీహెచ్‌సీ సందర్శన

చెన్నూర్‌రూరల్‌: మండలంలోని అంగ్రాజ్‌పల్లి పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుబ్బరాయుడు మంగళవారం పరిశీలించారు. ఓపీ రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. ఏఎన్‌ఎంలు, ఆశాల సమావేశం ఏర్పాటు చేశారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ తగలకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్యులు శిల్ప, కృష్ణతేజ, పీవో ప్రతాప్‌, హెచ్‌ఈవో జగదీశ్‌ పాల్గొన్నారు.

నగదు స్వాధీనం

కాగజ్‌నగర్‌ రూరల్‌: వంజీరి చెక్‌పోస్టు వద్ద మంగళవారం తనిఖీలు చేపట్టి ఇద్దరి నుంచి న గదు స్వాధీనం చేసుకున్నట్లు కాగజ్‌నగర్‌ రూర ల్‌ సీఐ రాంబాబు తెలిపారు. మంచిర్యాల నుంచి కాగజ్‌నగర్‌కు వస్తున్న ఆదె సంతోష్‌ నుంచి రూ.56,500, రయీస్‌ అహ్మద్‌ నుంచి రూ.81, 850 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement