Sakshi News home page

బెంగాలీల వేడుకలు

Published Sun, Apr 14 2024 11:50 PM

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్‌బాబు - Sakshi

కాగజ్‌నగర్‌రూరల్‌: సిర్పూర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆదివారం బెంగాలీ ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ పూజ, నగర సంకీర్తనలు నిర్వహించారు. కాగజ్‌నగర్‌ మండలంలోని విలేజ్‌ నం. 12లో మనోరంజన్‌ మండల్‌ నివాసంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌బాబు పాల్గొన్నారు. నాయకులు అషుతోష్‌ మండల్‌, గోవింద్‌ మండల్‌, కమల్‌ సర్కార్‌ తదితరులతో కలిసి పూజలు చేశారు. అలాగే నజ్రూల్‌నగర్‌లోని వేదమందిరంలో శనివారం రాత్రి నిర్వహించిన సామూహిక పూజ, విలేజ్‌ నం.2, విలేజ్‌ నం.5లో నిర్వహించిన శివపూజ, విలేజ్‌ నం.11లో హరిసభ పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీటీసీ బికాస్‌ ఘరామి, నాయకులు కాళిదాస్‌ మజుందార్‌, రణ్‌వీర్‌బిశ్వాస్‌, అమిత్‌ బిశ్వాస్‌, విజయ్‌ ఘరామి, సమీర్‌ గుప్తా, రాకేశ్‌రాయ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement