జిల్లాలో చెక్‌పోస్టుల తనిఖీ | Sakshi
Sakshi News home page

జిల్లాలో చెక్‌పోస్టుల తనిఖీ

Published Tue, Nov 21 2023 12:40 AM

వైన్స్‌లో తనిఖీ చేస్తున్న సూపరింటెండెంట్‌  - Sakshi

కరీంనగర్‌ క్రైం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ పి.శ్రీనివాసరావు సోమవారం తనిఖీ చేశారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. అనుమతి లేకుండా మద్యం నిల్వ చేసినా, విక్రయించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ తాతాజీ తదితరులున్నారు.

చొప్పదండిలో వైన్స్‌లు..

చొప్పదండి: పట్టణంలోని వైన్‌లను ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు సోమవార ం తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించా రు. ఆర్నకొండలోని చెక్‌పోస్టును తనిఖీ చేసి, రికార్డులు చూశారు. అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ తాతాజీ, చెక్‌పోస్టు పర్యవేక్షకుడు శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రైలు పట్టాలు..

ఓదెల(పెద్దపల్లి): కాజీపేట నుంచి బల్లార్షా సెక్షన్ల మధ్య ప్రమాదాల నివారణ కోసం రైల్వేశాఖ రైలు పట్టాల తనిఖీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారంరోజులుగా పెరుగుతున్న చలితీవ్రతకు రైలు పట్టాలు సంకోచ, వ్యాకోచాలు చెంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటి నియంత్రణకు ప్రత్యేకంగా రైలు ఇంజిన్‌ పర్యవేక్షణ చేస్తోంది. ఓదెల, పొత్కపల్లి, రామగుండం, మంచిర్యాల, కొలనూర్‌, రాఘవాపూర్‌, పెద్దపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలుపట్టాలను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఆటోడ్రైవర్‌పై కేసు

కరీంనగర్‌ క్రైం: అనుమతి తీసుకోకుండా ఓ పార్టీ అభ్యర్థికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను తన ఆటోపై అంటించుకున్న ఆటోడ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం.. భూక్య బాక్య కరీంనగర్‌ బస్టాండ్‌ నుంచి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ప్రచార పోస్టర్‌ను తన వాహనంపై అంటించుకున్నాడు. బస్టాండ్‌ వద్ద ఎన్నికల పర్యవేక్షణ అధికారులు గుర్తించి, అనుమతి పత్రం చూపించాలని కోరగా లేదని చెప్పాడు. దీంతో వారు వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాక్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ స్వామి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement