మూణ్ణెళ్ల ముచ్చటగానే.. | Sakshi
Sakshi News home page

మూణ్ణెళ్ల ముచ్చటగానే..

Published Mon, Mar 25 2024 1:05 AM

-

బీసీ నినాదంతో ఇద్దరు నేతలు కూడా గద్వాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించించారనే చెప్పవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మూడు నెలలకే వీరి మధ్య ఉన్న ఐకమత్యం విభేదాలుగా మారి వారి ఆధిపత్యంగా తయారయ్యాయి. దీంతో వీరిమధ్య ఉన్న ఐక్యత మూణ్ణెళ్ల ముచ్చటే అన్న రీతిలో రెండు వర్గాలుగా చీలిపోయారనే ప్రచారం వినిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గద్వాలలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల బదిలీ ప్రక్రియ మొదలైంది. ఇక్కడే ఇరువురు నేతల మధ్య అభిప్రాయబేధాలకు బీజం పడిందనే ప్రచారం ఉంది. ముఖ్యంగా పోలీసుశాఖలో ఓ డివిజనల్‌ అధికారి బదిలీ, అదేవిధంగా సర్కిల్‌ అధికారుల బదిలీలపై ఇరువురు నేతల మధ్య విభేదాలు పొడచూపాయని గుసగుసలు వినిపించాయి. అధికారుల నియామకాలు కేవలం కులం ప్రాతిపదికనే నియమిచుకుంటూ వెళితే పార్టీకి చెడ్డపేరు వస్తుందని, రాజకీయంగా కూడా ఇబ్బందులు ఏర్పడతాయని ఇరువురు నేతల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు అప్పట్లో జోరుగా వినిపించిన ప్రచారం. అదేవిధంగా ఓ నియోజకవర్గ నామినేటెడ్‌ స్థాయి పోస్టు రిజర్వేషన్‌ వ్యవహారంలో కూడా ఇద్దరి నేతల మధ్య దూరాన్ని మరింత పెంచిందని సమాచారం. గద్వాల ప్రాంతానికి కొత్త అయినప్పటికీ తనకున్న పరిచయాలతో వీరిని భుజానేసుకుని రాజకీయంగా గట్టిపునాది వేస్తే తన మాటను బేఖాతారు చేస్తుండడం పట్ల సదరు నేత తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని పలువురి ద్వారా తెలుస్తుంది. ఈకారణంగానే గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉండగా మరోవైపు పార్టీలో తామే ముఖ్యనేతలమని, తాము ఎన్నికల్లో పోటీ చేసి సొంత ఆస్తులను అమ్ముకుని పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చుపెట్టడమే కాకుండా రాజకీయంగా అన్ని రకాల త్యాగాలు చేశామని మరోనేత అంతర్గత చర్చలలో చెబుతుండడం గమనార్హం. మొత్తంగా ఇరువురు నేతల మధ్య అంతరం పెరిగిందని పార్టీ నేతలే చర్చించుకుంటుండడం విశేషం.

Advertisement

తప్పక చదవండి

Advertisement