ముగిసిన ఎన్నికల ప్రచారం | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎన్నికల ప్రచారం

Published Wed, Nov 29 2023 1:44 AM

-

కాటారం: నెల రోజులుగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత గ్రామాల్లో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ముగియడంతో తుది ఘట్టానికి చేరుకొంది. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి అభ్యర్థులు తమ ప్రచారాలకు బ్రేక్‌ వేశారు. కొన్ని రోజులుగా గల్లీగల్లీ తిరిగి సందడి చేసిన ప్రచార రథాలు మూగబోయి ఓ మూలకు చేరుకున్నాయి. సౌండ్‌ బాక్స్‌లు, మైకులు సైలెన్స్‌ అయిపోయాయి. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ పలు పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రహస్యంగా వాడవాడన తిరుగుతుండటంతో మరో రకమైన సందడి నెలకొంది. ప్రచార రథాల శబ్ధం తగ్గిపోయి బైక్‌ల శబ్ధం మొదలైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకొచ్చారు. పోలీస్‌ బలగాలు రంగంలోకి దిగి గుంపులు గుంపులుగా జనసమూహం లేకుండా చర్యలు చేపట్టారు. ఎఫ్‌ఎస్‌టీ, సీసీఎఫ్‌, స్పెషల్‌ స్క్వాడ్‌ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల నిర్వహణపై నిఘా కొనసాగిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement