108 సిబ్బందికి రాష్ట్ర స్థాయి అవార్డు | Sakshi
Sakshi News home page

108 సిబ్బందికి రాష్ట్ర స్థాయి అవార్డు

Published Tue, Apr 23 2024 8:25 AM

- - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఉత్తమ సేవలు అందిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడినందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌ 108 ఎమర్జెన్సీ సర్వీస్‌ సిబ్బంది ఈఎంటీ హరికృష్ణ, పైలట్‌ యాకయ్య కు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. ఈమేరకు హైదరాబాద్‌ మేడ్చల్‌లోని ప్రధాన కార్యాలయంలో 108 సీఈఓ ఖాలిద్‌, డైరెక్టర్‌ వెంకటేశం చేతుల మీదుగా సోమవారం అవార్డు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ నసీరుద్దీన్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌ అభినందించారు.

ఇంటి పన్నుపై

5శాతం రాయితీ

జనగామ రూరల్‌: ఇంటి పన్ను ముందుగా చెల్లించిన వారికి ప్రభుత్వం 5 శాతం రాయితీ కల్పించిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ పింకేష్‌ కుమార్‌ అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పన్నుల వసూలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పన్ను చెల్లించడానికి వచ్చిన వారికి రాయితీ వివరాలు వివరించి పలువురికి రశీదు అందజేశారు. అనంతరం నర్సరీని సందర్శించి న అదనపు కలెక్టర్‌.. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకో వాలని నిర్వాహకులకు సూచించారు. మున్సిప ల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.

విద్యుత్‌ ప్రమాదాలను నివారించాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎన్పీడీసీఎల్‌ జనగామ ఎస్‌ఈ వేణుమాధవ్‌ అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం విద్యుత్‌ ప్రమాదా ల నివారణపై డీఈ ఎం.హుస్సేన్‌నాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. నిరంతర సేవలందించే విద్యుత్‌ సిబ్బంది విధి నిర్వహణలో తడబాటుకు గురికా కుండా ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. ఎస్‌ఏఓ జయరాజ్‌, టెక్నికల్‌ డీఈ ప్రభావతి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏడీఈ సత్యనారాయణ, ఏడీఈ ప్రొటక్షన్‌ శ్రీరామ్‌, ఎస్‌పీఎం సుజాత, భువనేశ్వరి, మాస్టర్‌ ట్రెయినర్లు మహేందర్‌రెడ్డి, యాదగిరి, ఏఈలు, సబ్‌ ఇంజనీర్లు, ఐఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో

అలసత్వం వద్దు : కొమ్మూరి

జనగామ: వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వం చేయకుండా వెంటనే చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. తేమ 17 శాతం ఉన్న ధాన్యంతో పాటు కొంత అటు ఇటుగా ఉన్న సరుకును సైతం మంచి ధరతో కొనుగోలు చేయాలని కోరారు. మార్కెట్‌లో క్రయవిక్రయాలను ప్రారంభించడానికి కృషి చేసిన జిల్లా అధికారులు, రైతు సంఘం నాయకులు, ట్రేడర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం

లింగాలఘణపురం: నేలపోగుల గ్రామంలో కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్‌ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాల్లో బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసేందు కు రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నేలపోగులకు వెళ్లగా ఎంపీటీసీ, సాంస్కృతిక సేన రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ల నర్సయ్య మాట్లాడుతూ స్థానిక సర్పంచ్‌ దూసరి గణపతిని బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని, పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేశాడంటూ సమన్వయ కమిటీ సభ్యులతో వాగ్వాదానికి ది గారు. కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ నాయకులు రాజు, ఆంజనేయులు, కొమురయ్య, అబ్బ య్య, నర్సింహ, రామచందర్‌, సత్తయ్య, నాగరాజు తదితరులు బయటికి వెళ్లిపోయారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement