వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఒరెగాన్ రాష్ట్రంలోని బెండ్ నగరంలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా, కాల్పులు జరిపిన 16 ఏళ్ల యువకుడు కూడా ఈ ఘటనలో మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. స్కూల్ ప్రాంగణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుపై కాల్పులు జరిపినట్లు తొలుత అత్యవసర సమాచారం అందింది. క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తుపాకీ గాయంతో పడి ఉన్న నిందితుడిని గుర్తించారు. అయితే అతడిని ఎవరు కాల్చి చంపారనే విషయంపై స్పష్టత రాలేదు. నిందితుడిని అక్కడే ఉన్న మరో వ్యక్తి కాల్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
BREAKING UPDATE: Three children, ages 5, 8, and 11, and one teacher were killed in a shooting at Silver Rail Elementary School in Bend, Oregon. A 16-year-old shooter was followed into the school by a community member who neutralized him. A 7-year-old child and another teacher were critically injured and transported to a local hospital. According to police, the shooter first fired at a vehicle outside the school before forcing his way inside through locked doors. It is not yet clear whether he had any connection to the school. Neither the victims nor the shooter have been publicly identified at this time. The investigation is ongoing.
— I Meme Therefore I Am 🇺🇸 (@ImMeme0) October 16, 2026
ఇక, ఈ పాఠశాలలో కిండర్గార్టెన్ నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది. సాధారణంగా ఐదు నుంచి 11 ఏళ్ల వయసున్న చిన్నారులు ఇక్కడ చదువుకుంటారు. పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు, 40 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు దారితీసిన కారణాలు, మృతుల వివరాలు, నిందితుడి మృతికి దారితీసిన పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు చదువుకునే పాఠశాలలోనే ఈ దారుణం చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఇదీ చదవండి: India-US trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు


