కారుతో ఢీకొట్టడంతో.. తీవ్ర గాయాలతో రెండు కాళ్లు కోల్పోయిన ఎంపీ! | Australian lawmaker Helen Haines loses both legs | Sakshi
Sakshi News home page

కారుతో ఢీకొట్టడంతో.. తీవ్ర గాయాలతో రెండు కాళ్లు కోల్పోయిన ఎంపీ!

Oct 21 2026 2:51 PM | Updated on Oct 21 2026 4:42 PM

Australian lawmaker Helen Haines loses both legs

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఇండిపెండెంట్‌ పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) హెలెన్ హైన్స్‌పై దాడి జరిగింది. విక్టోరియా రాష్ట్రం వాంగరట్టాలో ఉన్న ఆమె కార్యాలయం వెలుపల సోమవారం గుర్తుతెలియని వ్యక్తి కారుతో ఆమెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదకర దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతతో ఆమె తన రెండు కాళ్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె భర్త ఫిల్ హైన్స్ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి 43 ఏళ్ల బ్రెండన్ న్యూజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ప్రతినిధిపై దాడికి పాల్పడినట్లు ఆయనపై పలు కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం కాదని, ముందస్తు పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే జరిపిన దాడిగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అభివర్ణించారు.

పోలీసుల దర్యాప్తులో భాగంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి కుటుంబానికి, హెలెన్ హైన్స్‌కు గత 20 ఏళ్లకు పైగా పరిచయం ఉన్నట్లు తేలింది. అయితే, ఈ దాడికి గల అసలు కారణాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మరోవైపు, నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. అతడు అరుదైన నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. ఇరు పకక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసు తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: టీడీపీకి భారీ షాక్‌.. కన్నీరు పెడుతూ కీలక నేత రాజీనామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement