May Day శ్రమైక జీవనం | Today is World Labor Day | Sakshi
Sakshi News home page

May Day శ్రమైక జీవనం

May 1 2025 3:19 AM | Updated on May 1 2025 10:18 AM

Today is World Labor Day

నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం

కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు... ఒంటి చేత్తో తోసిరాజని....పనిలో తమను తాము నిరూపించుకున్నారు మహిళా కార్మికులు.కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణగా నవీన శక్తిలా ముందుకు వచ్చారు మహిళా కార్మికులు.శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబం అయ్యారు.‘ఈ రంగంలో మహిళలు పనిచేయలేరు’ అనుకునే రంగాలలోకి వచ్చి అ΄ోహలను బద్దలు కొట్టారు.‘పురుషులకు ఎక్కడా తీసిపోము’ అని నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. అయితే... ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళా ఉద్యోగులు, కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన చర్చను ముందుకు తెచ్చింది. వివిధ సర్వేల ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలు పనిప్రాంతంలో ఏదో ఒక రకమైన శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.మహిళా సిబ్బందికి వారి పనిప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చాలాప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేదు. సరైన నిఘా, రిపోర్టింగ్‌ యంత్రాంగం లేక΄ోవడంతో అనుచిత ప్రవర్తన, వేధింపులు పెరిగాయి.ప్రాంథమిక భద్రతా చర్యల గురించి చాలా సంస్థలలో మహిళా ఉద్యోగులకు అవగాహన కలిగించడం లేదు.

గార్మెంట్‌ ఫ్యాక్టరీలలో ఎక్కువమంది కార్మికులు మహిళలే. అయితే పురుషులతో ΄ోల్చితే వారికి తక్కువ వేతనం ఇస్తున్నారు. వేతన అసమానతలతో పాటు పనిప్రాంతంలో ప్రమాదాలు, పురుషాధిపత్య వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలలో మహిళాకార్మికులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది.

‘బిజినెస్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌’ రిపోర్ట్  మన దేశంలో గార్మెంట్‌ ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. నిజానికి ‘ఇది కేవలం గార్మెంట్‌ పరిశ్రమలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే’ అనుకోనక్కర్లేదు. చిన్నా, పెద్ద తేడాలతో ఎన్నో పరిశ్రమలలో వేరు వేరు రూపాల్లో ఇదే పరిస్థితి ఉంది.కోవిడ్‌ మహమ్మారి ఉమెన్‌ హెల్త్‌ వర్కర్‌లకు ప్రమాదాలు తెచ్చింది. విధి నిర్వహణలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.

చదవండి: ప్రిన్స్‌ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్‌

నిరాశ పడే పరిస్థితులు రావచ్చు, భద్రతాపరమైన సమస్యలు ఉండవచ్చు....ఒకటి, రెండు అని కాదు....సవాలక్ష సమస్యలు ఎదురైనా మహిళా శ్రామిక శక్తి వెనక్కి తగ్గడం లేదు.ఎందుకంటే వారు...చరిత్ర వింటూ వచ్చారు. మరో చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు.      

ఇదీ చదవండి: Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!

Advertisement
 
Advertisement
Advertisement