లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా.. | London based food vlogger shares easy recipe of India’s healthiest breakfast | Sakshi
Sakshi News home page

లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..

Apr 19 2026 3:39 PM | Updated on Apr 19 2026 4:07 PM

London based food vlogger shares easy recipe of India’s healthiest breakfast

లండన్‌కు చెందిన ఫుడ్‌ వ్లాగర్‌ బెంగళూరులో ఉండగా మన వంటకాలు నేర్చుకోవడమే గాక తయారు చేసి చూపించి ఔరా..! అనిపించుకున్నాడు. పైగా మన వంటకాల రుచులను మెచ్చకుంటూ వాటి గుణగణాల గురించి చెప్పేస్తున్నాడు కడా. మరి ఎవరా వ్లాగర్‌?, అతడి మనసుని దోచిన వంటకం ఏంటి?..అంటే..

యూకేకు చెందని వ్లాగర్‌ జూలియస్‌ ఫ్లీడర్‌ బెంగళూరులో వంటకం నేర్చుకున్న తర్వాత ఇంట్లో వంటకాన్ని తయారు చేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆవికి మీద వండే ఆ వంటకం వివిధ పప్పుల మిశ్రమాలను కలపడం, నానబెట్టడం దగ్గర నుంచి రుబ్బి పులిబయెట్టడం వరకు వివిద ప్రక్రియలను పంచుకున్నారు. కొన్ని ఆహారాలు మన మనసుని తాకుతాయి. వాటి రుచి నాలుకపై అలా నిలిచిపోతుంది. మెత్తగా దూదిలా ఉండే ఆ బ్రేక్‌ఫాస్ట్‌ ఎప్పటికీ విసుగు చెందని ఆహారం. వేడి వేడి  సాంబార్‌ లేదా చట్నీతో తింటే అబ్బా ప్రాణం లేచవచ్చినట్లుగా అనిపిస్తుంది, సంతృప్తిగా అనిపిస్తుంది.

జూలియస్ ఫీడ్లర్ బియ్యం, మిన పప్పుల పిండిని పులియబెట్టడంతో తన వంట ప్రక్రియను ప్రారంభించారు. సరైన మెత్తదనం కోసం ఈ రెండు పదార్థాలను విడివిడిగా కొన్ని గంటల పాటు నానబెట్టాలని ఆయన సూచించారు. ఆ తర్వాత, నానబెట్టిన నీటిలో కొంత భాగాన్ని బియ్యంతో కలిపి గరుకైన పిండిలా రుబ్బుకోవాలి, అదే సమయంలో మినప పప్పును నీటిలో తేలేంత మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం, అతను ఆ పిండిని కలిపి చేతితో కలపడం ద్వారా పులియబెట్టే ప్రక్రియను ప్రారంభించారు.

ఆ వంట నిపుణుడు పిండి పరిమాణం పెరిగి, బుడగలు వచ్చినట్లు పులిసేంత వరకు ఉంచి, చివరగా చిటికెడు ఉప్పు చల్లారు. ఇడ్లీలకు సరైన అండాకారపు ఆకారం రావడానికి, సాంప్రదాయక ఇడ్లీ మేకర్‌లో వేసి, మరుగుతున్న నీటిపై ఆవిరి మీద ఉడికించి, అవి చక్కగా ఉబ్బేంత వరకు ఉంచి స్టవ్‌ ఆఫ్‌ చేశారు. ఇడ్లీ వద్దనుకుంటే మీడియం మంటపై పెనం పెట్టుకుని ఊతప్పంలా కూడా వేసుకోవచ్చని చెప్పారు. .

పులియబెట్టడం వల్ల కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై, ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలు పెరుగుతాయి. ఆ వీడియో చివరలో, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ వేడి వేడి ఇడ్లీలను సాంప్రదాయ అరటి ఆకులో అమర్చి, వాటితో పాటు చల్లని కొబ్బరి చట్నీతో జతచేశారు. వాటిని చూస్తే కచ్చితంగా నోరూరుతుంది. మన లండన్‌ వ్లాగర​ జూలియస్‌ మాత్రం ఆ అల్పాహారానికి అద్భుతం అని కితాబిచ్చాడు.

 

(చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం)

 

Advertisement
 
Advertisement
Advertisement