చినుకు తెచ్చిన సంబరం : ఒళ్ళంతా తుళ్ళింతే! వైరల్‌ వీడియో | Gujarat: Kutch farmer and son dance in rain goes viral | Sakshi
Sakshi News home page

చినుకు తెచ్చిన సంబరం : ఒళ్ళంతా తుళ్ళింతే! వైరల్‌ వీడియో

Jul 25 2024 11:22 AM | Updated on Jul 25 2024 4:38 PM

Gujarat: Kutch farmer and son dance in rain goes viral

మబ్బొచ్చినా, వానొచ్చినా తొలుత పులకించిపోయేది రైతన్నే. బీటలు వారిన నేలన నాలుగు చినుకులు పడినప్పుడు రైతు గుండె ఉప్పొంగి పోతుంది.  వర్షపు దాహం తీరిన మట్టి చిందించే పరిమళానికి ఉత్సాహంగా చిందులేస్తాడు. గుజరాత్‌లోని కచ్‌లోని ఒక ప్రాంతంలో సరిగ్గా ఇదే జరిగింది.  జోరుగా కురిసిన వాన ప్రవాహంలో పరిపూర్ణ ఆనందంతో తండ్రీ కొడుకులు  ఆనందంతో చిందులు వేశారు. అచ్చమైన రైతులా తండ్రి, అతనికి తోడుగా కొడుకు కూడా చేరాడు. ఇద్దరూ కలసి చేసిన అచ్చం లగాన్‌ సినిమాలో లాగా చేసిన గుజరాతీ సంప్రదాయ నృత్యం ఇంటర్నెట్‌లో హృద్యంగా నిలిచింది. రోనక్‌ గజ్జర్‌ అనే జర్నలిస్టు ఎక్స్‌లోదీన్ని పోస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement