తాటి చాక్లెట్‌ పాన్‌కేక్‌ ..సింపుల్‌ రెసిపి ఇలా చేసుకోండి | How To Make Palm Chocolate Cake Recipe In Telugu - Sakshi
Sakshi News home page

తాటి చాక్లెట్‌ పాన్‌కేక్‌ ..సింపుల్‌ రెసిపి ఇలా చేసుకోండి

Aug 24 2023 12:34 PM | Updated on Aug 24 2023 1:39 PM

How To Make Palm Chocolate Cake Recipe In Telugu - Sakshi

తాటి చాక్లెట్‌ పాన్‌కేక్‌  తయారీకి కావల్సినవి: 
తాటిపండు గుజ్జు – ఒకటిన్నర కప్పులు
కోకో పౌడర్‌ – 1 కప్పు, మైదాపిండి, బియ్యప్పిండి – ముప్పావు కప్పు చొప్పున, మొక్కజొన్నపిండి – పావు కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు
పంచదార – 2 కప్పులు
చిక్కటి పాలు – సరిపడా(కాచి చల్లార్చినవి)
ఉప్పు – చిటికెడు, నెయ్యి – చాలినంత

తయారీ విధానమిలా:  

  • ముందుగా తాటì పండు గుజ్జు, కోకోపౌడర్, కొబ్బరి తురుము, పంచదార కొద్దికొద్దిగా పాలు మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • తర్వాత ఒక పెద్ద బౌల్‌ తీసుకుని అందులో ఆ మిశ్రమంతో పాటు.. మైదాపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి, కోకో పౌడర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పాలు కలుపుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకుని, రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
  • తర్వాత పాన్‌లో నెయ్యి వేసుకుని.. మందంగా పాన్‌ కేక్స్‌ చేసుకుని.. ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి. వాటిపై చాక్లెట్‌ క్రీమ్, ఫ్రూట్స్‌ వేసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement