
క్యారట్ పరియాళ్ తయారీకి కావల్సినవి:
క్యారట్ ముక్కలు – కప్పున్నర; నూనె – రెండు టేబుల్ స్పూన్లు; ఆవాలు – పావు టీస్పూను; జీలకర్ర – పావు టీస్పూను; ఎండు మిర్చి – రెండు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి చీలికలు – మూడు; ఉప్పు – అరటీస్పూను; పసుపు – అర టీస్పూను; ఇంగువ – చిటికడు; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు.
తయారీ విధానమిలా:
∙క్యారట్ ముక్కలను మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ∙మందపాటి బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి ∙వేడివేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చివేసి చిటపటలాడనివ్వాలి ∙ఇవి వేగాక కరివేపాకు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి తిప్పాలి ∙ఐదునిమిషాలు మగ్గాక పసుపు, ఇంగువ వేసి కలపాలి ∙ఇప్పుడు ఉడికించిన క్యారట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొబ్బరి తురుము వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి ∙నూనె పైకి తేలిన తరువాత దించేసి సర్వ్‌చేసుకోవాలి.