మంకీ డ్యాన్స్‌ చాలెంజ్‌ | Fatima Sana Shaikh Twist To Viral Dance Challenge | Sakshi
Sakshi News home page

మంకీ డ్యాన్స్‌ చాలెంజ్‌

Published Sun, Nov 26 2023 4:28 AM | Last Updated on Sun, Nov 26 2023 4:28 AM

Fatima Sana Shaikh Twist To Viral Dance Challenge - Sakshi

ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్‌లు వస్తూ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్‌నెట్‌కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్‌లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్‌ డ్యాన్స్‌లను ఫాలో అవుతున్నారు.

‘గాంగ్నమ్‌’ డ్యాన్స్‌ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్‌ చాలెంజ్‌’ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫాతిమ సనా షేక్‌ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్‌ను స్వీకరించింది. పింక్‌ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అయింది. ‘దిస్‌ ఈజ్‌ అమేజింగ్‌’లాంటి కామెంట్స్‌తో కామెంట్‌ సెక్షన్‌ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్‌ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్‌ ఛాయిస్‌.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement