చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్‌ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్‌ వీడియో | chess Player Gukesh Manasilayo song and steps goes viral | Sakshi
Sakshi News home page

చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్‌ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్‌ వీడియో

Sep 30 2024 11:51 AM | Updated on Sep 30 2024 2:58 PM

chess Player Gukesh Manasilayo song and steps goes viral

చెన్నైకి చెందిన ఇండియన్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్   స్టార్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా హల్‌ చల్‌ చేస్తున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్  గెలిచి అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 

తాజాగా  కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామస్ తమిళ  సినిమా పాట స్టెప్పులతో అదర గొట్టాడు. మనసులాయో  అంటూ దీనికి సంబంధించిన  వీడియోను గుకేశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. చదరంగంలో ప్రత్యర్థులు తోకముడిచే స్టెప్పులే కాదు,అదిరే స్టెప్పులతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు అంటున్నారు  నెటిజన్లు.  

అంతేకాదు ‘‘యుద్ధంలో రాణి (చెస్‌లో క్వీన్‌ పాత్ర)ని ముందు పెట్టి  ఎలా నెగ్గాలో తెలిసినవాడు, మొత్తానికి గుకేశ్‌ రెండో కోణాన్ని ఆవిష్కరించాడు’ అంటూ పలువురు వ్యాఖ్యానించారు. మరి మన ఆటగాడి స్టెప్పులేంటో మీరూ చూసేయండి.

 

Advertisement
 
Advertisement
Advertisement