Beauty Tips: ఉల్లిపాయ రసం, ఆలివ్‌ ఆయిల్‌తో.. మచ్చలకు చెక్‌! ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది!

Beauty Tips: Onion Juice Amazing Benefits For Glowing Skin - Sakshi

ఉల్లిపాయలు ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా! ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది.
►ఉల్లిపాయలోని యాంటీసెప్టిక్‌ గుణాలు చర్మ సమస్యలకు చెక్‌ పెడతాయి. మచ్చలను తొలగిస్తాయి.
►టేబుల్‌ స్పూన్‌ ఉల్లి రసంలో టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ఫేస్‌ప్యాక్‌ లా వేయాలి.
►ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. మీ ముఖంలో నిగారింపు మీకే తెలుస్తుంది. 

చర్మం మెరిసిపోతుంది!
►టీ స్పూన్‌ పసుపులో సరిపడా ఉల్లిపాయ రసాన్ని కలిపి పేస్ట్‌లా చేయాలి.
►దీనిని ముఖానికి ప్యాక్‌ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
►ఇన్‌స్టంట్‌గా చర్మం మెరిసిపోతుంది.

►శనగపిండి, ఉల్లిరసం, పాలు .. మూడూ సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా ముఖానికి రాసుకుని.. కాసేపటి తర్వాత కడిగితే మొహం చంద్రబింబమే.
►అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని ఉల్లి తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాల వల్ల కలిగే హానిని అడ్డుకుంటాయి.

చివరగా ఒక మాట.., ఉల్లిపాయను తరిగేటప్పుడు కళ్లు మంటపుట్టి, నీళ్లు కారతాయి. అయితే అది కూడా మంచిదే. అలా నీరు కారడం వల్ల కళ్లలోని మలినాలు తొలగిపోతాయి, అంతేకాదు, కంటి సమస్యలను నివారించడంలో ఉల్లికి సాటి మరేదీ లేదు. నేత్ర సమస్యలకు చెక్‌ పెట్టాలంటే మీ డైట్‌లో ఉల్లి ఉండేలా చూసుకోవాల్సిందే. 

చదవండి: పాలు కాచి చల్లార్చి.. పుల్లని మజ్జిగ కలిపి, ఈ పొడి వేసుకుని తాగితే పేగులకు బలం.. ఇంకా!
Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్‌.. పిగ్మెంటేషన్‌కు చెక్‌! ముఖం మెరిసేలా..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top