నలుగురు మహిళలపై దారుణం

UK Rapper Solo Jailed For 24 Years For Rapes - Sakshi

ర్యాప్‌ స్టార్‌ పైశాచికం

లండన్‌ : వర్ధమాన ర్యాప్‌స్టార్‌ తన నిర్బంధంలో ఉన్న నలుగురు మహిళలపై వారి ఇష్టానికి విరుద్ధంగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై బ్రిటన్‌ కోర్టు అతడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. సోలో 45 అనే స్టేజ్‌ పేరుతో పేరొందిన ఆండీ అనోక్యే 2017లో లైంగిక నేరాలపై పట్టుబడినప్పుడు విలే, స్టార్మీ వంటి స్టార్లతో కలిసి పనిచేశాడు. 21 లైంగిక దాడి కేసుల్లో దోషిగా తేలిన ర్యాప్‌ ఆర్టిస్ట్‌ అనోక్యే (33)కు బ్రిస్టల్‌లోని సౌత్‌వెస్ర్టన్‌ సిటీ కోర్టు 5 సార్లు తప్పుడు శిక్షలు విధించినట్టు వెల్లడైంది. కాగా ర్యాప్‌ ఆర్టిస్ట్‌ వికృత లైంగిక ఆనందానికి బానిసగా మారాడని తాజా తీర్పు వెలువరిస్తూ జడ్జి విలియం హార్ట్‌ వ్యాఖ్యానించారు. చదవండి : డ్యూటీ దిగాక రూమ్‌కి రావాలని వేధింపులు

అనోక్యే ప్రముఖ ర్యాప్‌ బృందంలో సభ్యుడని, తోటి సభ్యులు వారి వృత్తిలో ఘన విజయాలు సాధించారని జడ్జి పేర్కొన్నారు. అనోక్యే అకృత్యాలను బాధిత మహిళలు సహించలేరని వ్యాఖ్యానించారు. కత్తితో బెదిరించి  అనోక్యే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ బాధిత మహిళ వెల్లడించగా, అనోక్యే తన పట్ల దారుణంగా వ్యవహరించాడని మరో మహిళ పేర్కొన్నారు. మహిళలతో తాను వారి సమ్మతితోనే ‘క్యాచ్‌ మి, రేప్‌ మి’ గేమ్‌లో భాగంగా ఇలా చేశానని అనోక్యే కోర్టుకు తెలిపాడు. లైంగిక దాడి కేసులో అనోక్యేను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి ఫోన్‌లో అనోక్యే నిర్వాకాలకు సంబంధించిన పలు వీడియోలను గుర్తించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top